సుప్రీం కోర్టులో జరిగే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం

అమరావతి: సుప్రీంకోర్టు జరిగే కేసు విచారణను మొదటిసారి యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు.మంగళవారం ఒకే రోజు మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారిస్తున్న EWS కేసుతోపాటు, జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను, జస్టిస్ ఎస్‌కే కాల్ బెంచ్ జరుపుతున్న మరో విచారణను సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ చేసింది.త్వరలోనే సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రత్యేక మీడియా ద్వారా కేసు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణలను మాత్రమే ప్రసారం చేస్తారు. తరువాత మిగతా ధర్మాసనాలు జరిపే విచారణలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన నిర్ణయం 2018లోనే తీసుకున్నప్పటికి, ఆచరణలోకి రాలేదు.గత నెలలో రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ,తన పదవీ విరమణ రోజున లైవ్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దేశంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటిసారి.
For the first time, the Constitution Bench of the Supreme Court live streams three hearings for the public. https://t.co/oHFFQY75Jv pic.twitter.com/sRcJyLa57c
— ANI (@ANI) September 27, 2022