బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్

అమరావతి: ఉన్నత పదవుల్లో శ్వేతజాతీయేతరులను బ్రిటన్ ప్రజలు సహించలేరన్న వాదనలు నిజం చేస్తు, బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్(47) ఎన్నికయ్యారు..సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎన్నికల ఫలితాలను వెలువరించారు..లిజ్ ట్రస్ కు 81.326 ఓట్లు రాగా రిషీ సునాక్ కు 60.399 ఓట్లు వచ్చాయి..అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు లిజ్‌కే పట్టం కట్టడంతో ట్రస్,,రిషిపై 20.927 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు..రిషి సునాక్‌ను ప్రధానిగా చూడాలనుకున్నప్పటికి,జాత్యహకారం తెరవెనుక బలంగా పనిచేసిందనే వాదనలు విశ్లేషకుల నుంచి విన్సిస్తున్నాయి..పార్టీ సభ్యులు తొలుత రిషికే మద్దతు తెలిపినా,,లిజ్ ట్రస్ క్రమక్రమంగా రిషిపై పైచేయి సాధించేందుకు మాజీ ప్రధాని బోరిస్,మంత్రంగా నడిపించేరనేది జగమేరిగిన సత్యం..లండన్ రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం రిషి అపజయానికి ఎన్ని కారణాలు చూపించిన అతీమంగా భారతీయ మూలాలున్న రిషి శ్వేతజాతీయేతరుడు కావడం కూడా ఓ కారణమనేది స్పష్టం..