అమరావతి: ఢిల్లీ పోలీసు విభాగంకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ ద్వారా రూ.500 కోట్లు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేశారు..22 మంది సభ్యుల ముఠా మొత్తం 100కు పైగా లోన్ యాప్స్ ను హ్యండిల్ చేస్తున్నట్లు గుర్తించారు..లోన్ యాప్స్ కార్యకలపాలను చైనీయులు పరివేక్షిస్తున్నట్లు గుర్తించారు..వినియోగదారుల ప్రైవసీ డేటాను సేకరించి,, చైనా, హాంకాంగ్ సర్వర్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని IFSO డిప్యూటివ్ కమీషనర్ ఆఫ్ పోలీసు KPS మల్హోత్ర తెలిపారు..పోలీసులు దాదాపు 2 నెలల పాటు నిఘా పెట్టి.. నిందితులను అరెస్టు చేశారు..ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లకు ఈ నెట్ వర్క్ విస్తరించిందని,,చెల్లింపులు చేసిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలు, హవాలా మార్గంలో చైనాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు..రోజుకు కనీసం కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు..అరెస్ట్ అయిన నిందితుల నుంచి 51 ఫోన్లు, 25 హార్డ్ డిస్క్ లు, 9 ల్యాప్ టాప్ లు, 19 డెబిట్, క్రెడిట్ కార్డులు, 3 కార్లు, 4 లక్షల నగదును ఢిల్లీ పోలీసులు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ & స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం స్వాధీనం చేసుకుందన్నారు..