ఎల్.ఆర్.ఎస్ చివరి తేది అక్టోబరు 31-త్వరిత గతిన పూర్తి చేయండి- కమిషనర్ హరిత

నెల్లూరు: నగరంలోని 54 డివిజనుల్లో (లే అవుట్ రెగులేషన్ స్కీం) L.R.S 2020 పధకం, 2022 అక్టోబర్ 31వ తేదితో ముగియనున్నందున, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు.నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో L.R.S పై సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న వార్డు ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్ లో ఉన్న దరఖాస్తుల భూస్థితి, డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం 170 అప్లికేషన్ లను నేటితో పూర్తి చేశామని తెలిపారు.L.R.Sపై లే-అవుట్ యజమానులకు అవగాహన కల్పించి అప్లికేషన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిసిపి, ఎ.సి.పి, టిపిఓ లు, వార్డు ప్లానింగ్ & రెగులేషన్ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.