మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారు-చక్రధర్ బాబు

నెల్లూరు: ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఉండాలని జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.మంగళవారం వెంకటాచలం మండలం, కసుమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరు ముద్ద (మధ్యాహ్న భోజన పథకం) పథకం అమలును కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వండిన వెజిటబుల్ రైస్-కుర్మా రుచి చూశారు. ఈ సంధర్భంగా కలెక్టర్, విద్యార్ధులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. విధ్యార్ధులతో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, రుచిగా ఉంటుందా, మెనూ ప్రకారం ఏ రోజు ఏ భోజనం పెడ్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తృన్నారా లేదా అని కలెక్టరు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కలెక్టర్, చిన్నారుల భవిష్యత్తుకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, తహశీల్దార్ నాగరాజు, ఏం.పి.డి.ఓ శ్రీమతి సుస్మిత, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ శ్రీధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.