AMARAVATHITECHNOLOGY

LVM3-M3 రాకెట్ ప్రయోగం విజయవంతం-నిర్దేశిత కక్ష్యలోకి 36 One Web ఉపగ్రహాలు

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వాణ్యిజ పరంగా శాటిలైట్స్ ను ప్రయోగించే వేదికగా చరిత్రలో మరో మైలు రాయిని చేరుకుంది..24.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా షార్ లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి LVM3-M3 రాకెట్ One Webకు సంబంధించి 5.6 టన్నుల బరువు వున్న 36 ఉప గ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకుని వెళ్లింది..ఈ ప్రయోగం కోసం ఉపయోగించే లాంచ్‌ వెహికల్‌ పేరును GSLV (జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికిల్‌ మార్క్‌ త్రీని లాంచ్‌ వెహికల్‌) మార్క్‌ త్రీగా మార్చారు..ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు మలిచారు..”సిరీస్ లోని మొదటి 16 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో ప్రవేశంపెట్టాం అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.మిగిలిన ఉపగ్రహాలు విడిపోవడంపై ధ్రువీకరించాల్సి వుంది..LVM3-M3 వాహకనౌక పనితీరు అధ్భుతంగా వుంది..వాహకనౌక మరో సారి సత్తా చాటింది”,,ఈ మిషన్ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. బ్రిటన్‌కు చెందిన One Web సంస్థతో ఇస్రో 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది..ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది అక్టోబర్‌ 23న 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో తాజాగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది..

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *