NATIONAL

లోకాయుక్త-2022 బిల్లుకి మహారాష్ట్ర అసెంబ్లీ

అమరావతి: లోకాయుక్త-2022 బిల్లుకి మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది..ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తొలి రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ప్రభుత్వం నిలిచింది..విపక్షాల గైర్హాజరు నేపథ్యంలో ఎలాంటి చర్చ జరక్కుండానే బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది..ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ లోకాయుక్త పరిధిలోకి వస్తారు..యూపీఏ-2 ప్రభుత్వం చివరి సంవత్సరంలో లోకాయుక్తపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొనడంతో అన్నా హజారే దీక్ష చేపట్టారు..ఇందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది..నేడు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనర్హం..వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ,, దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని మెలికలు పెట్టింది.. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం,, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది..సభ సమావేశాలకు ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది..అలాంటి తీర్మానాన్ని సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల ఆమోదం పొందాలి..లోకాయుక్తలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్పర్సన్గా ఉంటారు..సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు..బిల్లును ఆమోదించిన అనంతరం సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు..ఈ లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *