గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేయాలి-కలెక్టర్

నెల్లూరు: విశాఖపట్నంలో వచ్చే మార్చి 3, 4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను విజయవంతం చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సులో జిల్లాలోని ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం మారుతీ ప్రసాద్, ఏపీఐఐసీ జడ్ఎం చంద్రశేఖర్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేష్, పరిశ్రమల కేంద్రం డిడి షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.