x
Close
DEVOTIONAL DISTRICTS

సింహ వాహనంపై విహరించిన మలయప్పస్వామి

సింహ వాహనంపై విహరించిన మలయప్పస్వామి
  • PublishedSeptember 29, 2022

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడోవ రోజు గురువారం ఉదయం 8 గంట‌లకు సింహ వాహనంను అధిరోహించిన శ్రీవారు తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. తిరుమాఢ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని మలయప్ప స్వామి వారు అధిరోహించారు.. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.