కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడుగా మల్లికార్జున ఖర్గే విజయం

అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు 22 సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌కి తొలిసారి గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా,ఇతర వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఇస్తున్న విషయంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి.ఈ ఎన్నికలు పాదర్శకంగా జరగాలని శశి థరూర్ మొదటి నుంచి కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.