అమరావతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,,ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు..శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు..పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు..మమత ఢిల్లీలో 4 రోజుల పాటు బస చేయనున్నారు..రాష్ట్రపతి ముర్మును కూడా కలుసుకోవడంతో పాటు నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరౌతారని సమాచారం..పశ్చిమబెంగాల్‌లో SSC స్కామ్‌లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ED కి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది..అర్పిత ఫ్లాట్ల నుంచి రూ.50 కోట్లకు పైగా నోట్ల కట్టలు, 5 కేజీలకు పైగా బంగారం నగలు బయటపడటంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది..పార్టీ పరువు తీసిన పార్థాను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు డబ్బుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ ప్రధాన నాయకులు వ్యాఖ్యనించారు..అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం బెంగాల్ లో జోరుగా సాగుతొంది..పార్థా-అర్పిత లీలలు రోజుకొకటి బయటకు వస్తుండటంతో మమతకు దిక్కుతోచడం లేదు..తృణముల్ కాంగ్రెస్ లో అన్ని తానై నడిపిస్తున్న దీదీ మేనట్లుడు ప్రాత ఏమైన బయటపడుతుందా అనే కోణంలో బంగాల్ వ్యాప్తంగా చర్చజరుగుతొంది..