చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా

అమరావతి: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ 6వ ర్యాంకర్,3సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన జపాన్ ప్లేయర్ హినా హయత్‌పై 4-2 ( 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) పాయింట్లతో ఓడించి. బ్రాంజ్ మెడల్ ను దక్కించుకుంది. దీంతో ఆసియా కప్ టేబుల్ టెన్నిస్లో కాంస్యం సాధించిన మొదటి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనికా రికార్డు నెలకొల్పింది.