అమరావతి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ,దర్యప్తులో,,కొంత మంది నార్కోటిక్స్ అధికారులు పలు అవకతవకలకు పాల్పపడినట్లు గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక చార్జిషీట్ ను సిద్దం చేసింది.,2021 అక్టోబర్ 3వ తేదిన కోర్డెలియా క్రూయిజ్ షిప్ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో 15 మందిని,, NCB అధికారి సమీర్ వాంఖేడి, అరెస్టు చేయడంతో,,నాడు ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..దాదాపు 3 మూడు వారాల పాటు ఆర్యన్ ఖాన్ రిమాండ్ ఖైదీగా జైలులో గడిపిన తరువాత అతనిపై అన్ని కేసులు ఎత్తివేసిన NCB,,రాజకీయ వత్తిళ్ల కారణంగా సమీర్ వాంఖేడిపై కేసు నమోదు చేసి,,అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.. ఆటు తరువాత ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు..మహారాష్ట్రలో థాకరే ప్రభుత్వం స్థానంలో షిండే ప్రభుత్వం రావడంతో,,సదరు కేసులో జరిగిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తో పాటు, 8 మంది అధికారుల పై 3వేల పేజీల ఛార్జిషీట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సిద్ధం చేశారు.
8 మంది అధికారులు:- ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో అధికారులు ప్రలోభాలకు లొంగి వ్యవహరించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం తన విజిలెన్స్ నివేదికను ఢిల్లీలోని ప్రధాన కార్యాయానికి అందించింది..ఈ నివేదికలో 65 మంది వాంగ్మూలాలు రికార్డు చేసుకోగా,, కొందరు 3 నుంచి 4 సార్లు వాంగ్మూలాలు మార్చినట్లుగా పేర్కొంది.. గతంలో జరిగిన విచారణ,,అనుకూలంగా వున్న వ్యక్తులను ఎంపిక చేసుకున్న ప్లాన్ ప్రకారం సాగినట్లు అధికార వర్గాలు తెలిపినట్లు సమాచరం..ఈ కేసు దర్యాప్తులో అనుమానాస్పదంగా వ్యవహించిన అధికారుల పై చర్యలు తీసుకునేందుకు సీనియర్ల నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు..ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొపొతున్నాయో వేచిచూడాలి ?