మావోయిస్టు అగ్రనేత హిడ్మా సేఫ్ ? మావోయిస్టుల లేఖ

అమరావతి: చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మా తప్పించుకుని క్షేమంగా వున్నాడంటూ మావోయిస్టు పార్టీ దృవీకరిస్తూ లేఖ విడుదల చేసింది..హిడ్మా మృతి అంటూ జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ కమిటీ ఈ లేఖను విడుదల చేసింది.. మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాల వేట కొనసాగుతోంది..మావోయిస్టుల కోసం గాలింపును తీవ్రం చేసిన క్రమంలో బుధవారం మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో హిడ్మా ఉన్నాడనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ నిర్వహించింది..ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందినట్లు వార్తాలు అందాయి..