హైదరాబాద్: కాంగ్రెస్ సినీయర్ నాయకుడు మర్రి.శశిధర్ రెడ్డిని, పీసీసీ క్రమశిక్షణ సంఘం,పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు తెలిపింది. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలవడంతోచ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నడంటూ చర్యలు తీసుకుంది. శుక్రవారం శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు.పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయనతో చెప్పినట్లు తెలియవచ్చింది.సహచరులతో చర్చించి మరో వారం రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారని సమాచారం.మరో వారం రోజుల్లో ఆయన జేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.