వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నచెల్లదు-సుప్రీంకోర్టు

అమరావతి: ఇటీవల కాలంలో యువతి,యువకులు మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు..మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిస్తూ,,వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది..కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని పేర్కొంది..2017లో ఓ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయమూర్తులు కేఎం జోసఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది..ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ హైకోర్టులో కేసు దాఖలు చేశారు..హిందువైన తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని 2008లో, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నానని,,ప్రస్తుతం అతను మరో వివాహం చేసుకున్నారని,,హిందూ వివాహ చట్టం 494 సెక్షన్ కింద అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు..అయితే దీనిపై సదరు వ్యక్తి స్పందిస్తూ తాను క్రైస్తవుడినని,,హిందూ వివాహ చట్టం తనకు వర్తించదని పేర్కొన్నారు.. అలాగే ఆమెను తాను వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపనందుకు కేసును కొట్టి వేయాలని కోరారు..ఇందుకు హైకోర్టు నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు..ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు,,వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ వివాహమైనా హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని స్పష్టం చేసింది.