వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్

హైదరాబాద్: చిరంజీవి హీరోగా, రవితేజ ముఖ్యపాత్రలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా పేరును,దీపావళీ సందర్బంగా మెగా స్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అంటూ రివీల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు, మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతోందని ఇప్పటికే డైరెక్టర్, చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. కేవలం టైటిల్ తోనే సరిపెట్టుకోకుండా, చిన్న గ్లింప్స్ కూడా అభిమానుల కోసం విడుదల చేశారు. గ్లింప్స్ లో చిరంజీవి ఫుల్ మాస్ లుక్ లో కన్పించారు.. బీడీ కాల్చుతూ ఒక బాంబ్ పేలిస్తే విలన్స్ ఎగిరిపడ్డట్టు, చివర్లో ఇలాంటి ధమాకా ఎంటర్టైన్మెంట్స్ కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రయిబ్ అని చిరంజీవి డైలాగ్ చెప్పారు.గ్లింప్స్ చూస్తుంటే,,సముద్రం దగ్గర జరిగే స్టోరీ అని తెలుస్తోంది.ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపనున్నట్టు సినిమా యూనిట్ బృందం ప్రకటించింది.