x
Close
INTERNATIONAL NATIONAL

పద్మభూషన్ అవార్డును అందుకున్న మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్ల

పద్మభూషన్ అవార్డును అందుకున్న మైక్రోసాఫ్ సీఈఓ సత్యనాదెళ్ల
  • PublishedOctober 20, 2022

అమరావతి: భారత సంతతికి చెందిన అందునా హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల,,ప్రస్తుతం మైక్రోసాఫ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా సత్యనాదెళ్ల పద్మభూషన్ అవార్డును అందుకున్నారు.ఆవార్డు ప్రకటించిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అవార్డును అందుకునేందుకు సత్యనాదెళ్ల భారత్ కు రాలేకపోవడంతో, శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు..ఈ అవార్డు అందుకున్న సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆవార్డు అందుకోవడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు..రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు దేశ ప్రజలకు సత్యనాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు..దేశంలో సమ్మిళిత వృద్ధికి సాధికారత కల్పించడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్ర పై ప్రసాద్ తో చర్చించారు..రాబోయే దశాబ్ధంలో డిజిటల్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని నాదెళ్ల చెప్పారు..వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారని,ఇది గొప్ప ఆవిష్కరణకు దారి తీస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు..సాంకేతికతను మరింత పెంచే విధంగా దేశం అంతా తిరిగి ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే భారతదేశ అత్యున్నత పురస్కారాలలో పద్మ అవార్డులు ఒకటి.ఈ సంవత్సరం(2022) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన 17 మంది అవార్డు గ్రహీతల్లో సత్యనాదెళ్ల ఒకరు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.