మాస్కో తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్ పై సైనిక చర్య కొనసాగుతుందు-పుతిన్

అమరావతి: మాస్కో తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఉక్రెయిన్ పై తమ దేశ సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.. సుదూర-తూర్పు ఓడరేవు నగరమైన వ్లాడివోస్టాక్‌లో బుధవారం జరిగిన వార్షిక ఆర్థిక ఫోరమ్‌లో పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత ఆ దేశంలోని తూర్పున ఉన్న పౌరులను రక్షించడమే అన్నారు. ఉక్రెయిన్ విషయంలో పాశ్చాత దేశాల తీరుపై ఆయన మండిపడ్డారు. ‘‘సైనిక చర్యను ప్రారంభించింది మేము కాదు..మేము దీనికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నాం.మేము ఉక్రెయిన్ కు మా సైనికులను పంపడం వెనుక ప్రధాన లక్ష్యం దేశంలోని తూర్పు భాగంలో ఉన్న పౌరులను కాపాడడమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా మద్దతు ఉన్న ఉక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాలను కాపాడుకునేందుకే తాము సైనిక చర్య కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల వారు ఉక్రెయిన్ దళాలతో 2014 నుంచి పోరాడుతున్నారని చెప్పారు. ఇది తమ విధి అని, తుది వరకు పోరాడుతూనే ఉంటాయని అన్నారు. పాశ్చాత దేశాలు విధించిన ఆర్థిక, సాంకేతిక ఆంక్షలను రష్యా తిప్పికొట్టిందని,,తాము కోల్పోయింది ఏమీ లేదని, తాము ఏమీ కోల్పోబోమని వ్యాఖ్యానించారు. తమ సార్వభౌమత్వ అధికారానికి మరింత బలాన్నిస్తున్నామని వెల్లడించారు..