NATIONAL

ధిల్లీ ఎయిర్ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సింధియా

అమరావతి: పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిథ్య సింధియా సోమవారం ఉదయం ధిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్-3 ని ఆకస్మికంగా సందర్శించారు.ధిల్లీ విమానాశ్రయంలో వీపరితమైన ఆలస్యం జరుగుతున్న నేపద్యంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ప్రయాణికుల్లో కొంత మంది సోషల్ మీడియా వేదికగా మంత్రికి పోస్టులు పంపారు.ఈ నేపధ్యంలో టెర్మినల్-3 పరిశీలించిన మంత్రి,ఎయిర్ పోర్టు అదికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ ఎయిర్ పోర్టులో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతని దృష్టిలో వుంచుకుని, ఎయిర్ పోర్టులోకి వున్న 13 ఎంట్రెన్స్ సంఖ్యను 16కు పెంచడం జరిగిందన్నారు.అలాగే ఏ గేట్ వద్ద రద్దీ తక్కువగా వున్నదో తెలిసే విధంగా డిసేప్లే బోర్డుల ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *