హైదరాబాద్: బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాతో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ శనివారం హైదరాబాద్ లో సమావేశం అయ్యారు..రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అధికారం చేపట్టేందుకు బీజెపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతొంది. రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలను దగ్గరకు చేర్చుకొంటుంది.ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా,,హీరో ఎన్టీఆర్ తో సమావేశం కావడం,,అలాగే నేడు వరంగల్ లో జరగనున్న ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్బంగా నిర్వహించనున్న సభలో పాల్గొంనేందుకు హైదరాబద్ కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను,మిథాలీ రాజ్ ను కలిశారు..రాజకీయంగా ఈ సమావేశంకు పెద్ద ప్రాధన్యత లేకున్నప్పటికి,సెలబ్రిటీలు బీజెపీ వైపు చూడడం,ప్రజల్లో చర్చకు దారి తీస్తొంది.సాయంత్రం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో హీరో నితిన్ తో, నడ్డా సాయంత్రం భేటీ కానున్నడడం ఈ కొవలోకే వస్తుంది.