పి.డి యాక్ట్ నమోదు..
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు.భారీ భద్రత నడుమ గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం భద్రత దృష్ట్య చర్లపల్లి జైలుకు తరలించారు..19వ తేదిన ఫిబ్రవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా అలాగే ఏప్రిల్ 12వ తేది శ్రీరామ నవమి సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంగళ్ హాట్, షాయినాత్ గంజ్ పోలీసు స్టేష్టన్స్ ల్లో కేసులు నమోదయ్యాయి.ఈ కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా 41 (A) CRPC నోటీసులు జారీ చేశారు. 2004 రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయని, ఇందులో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని కమీషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు.మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.