జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతవారణశాఖ

నెల్లూరు: నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు…నెల్లూరుజిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. బుధ,గురువారల్లో జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అవకాశం ఉందన్నారు. రాష్ట్రమంతా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని,విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో గంటకు 15 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.