రాబోయే మూడు రోజుల్లో నెల్లూరులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం

నెల్లూరు: మధ్య బంగాళాఖాతం ప్రాంతములో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని నెల్లూరు వాతావరణ కేంద్రము అధికారి ఒక ప్రకటనలో తెలిపారు..ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి తీవ్రఅల్పపీడనంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య,,దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం ఉందన్నారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచన :- ఈరోజు, రేపు నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి(శనివారం) నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందన్నారు.