మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఫ్రీగా డిష్ టీవీ-కేంద్ర ప్రభుత్వం

అమరావతి: సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది..ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది..ఇందులో బాగంగా దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల DD ఉచిత DISH DTHలను పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్ లు అందించాలని నిర్ణయం తీసుకుంది..గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు,, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు రూ.2,539 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించింది..దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో ఉచితంగా డిష్ టీవీలను అందించాలని ప్రణాళికలు సిద్దంచేసింది.. దూరదర్శన్ ప్రస్తుతం 28 ప్రాంతీయ వాటితో సహా 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది..DD ఉచిత DISH DTHలను విస్తరించడం వల్ల DTH బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తొంది..