INTERNATIONAL

మోడీ దేశభక్తుడు,అన్ని రంగాల్లో భారత్ శక్తివంతంగా రూపుదిద్దుకుంది-పుతిన్

అమరావతి: ప్రపంచ దేశాలు ప్రస్తుతం వివిధ రకాలైన ఆర్దిక సమస్యలను ఎదుర్కొంటున్నయని,,అయితే భారత ప్రధాని మోడీ ముందు చూపుతో తీసుకున్న చర్యలు భేషుగా వున్నయంటూ రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని,ఆయన నాయకత్వంలో భారతతదేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. ‘‘మోడీ దేశభక్తుడు, ఆయన మేకిన్ ఇండియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినది. మోడీ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయన ప్రధాని అయినప్పటినుంచి భారత్ అన్ని రంగాల్లో శక్తివంతంగా రూపుదిద్దుకుంది’’ అని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని పుతిన్ అన్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఆధునిక రాజ్యంగా మారడంలో విపరీతమైన పురోగతిని సాధించిందని చెప్పారు. ఇండియాతో రష్యాకు ఎలాంటి సమస్య లేదని, అన్ని విషయాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్ లోనూ ఇది కొనసాగుతుందన్నారు. ప్రధాని మోడీ కోరినట్లుగా ఎరువుల సరాఫరాను  పెంచామని,ఇది ఇండియాలో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అణ్వాస్త్రాలు ప్రయోగించే ఆలోచన లేదు- ఉక్రెయిన్ పై అణ్వాస్త్రాలను ప్రయోగించాలన్న ఉద్ధేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచంపై వారి ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా సహా దాన్ని మిత్రపక్షాలపై ఆయన మండిపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *