మూసీనది ఉగ్రరూపం-రాకపోకలను నిలిపివేసిన పోలీసులు

హైదరాబాద్: భారీ వర్షాలతో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్లోని మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.. బ్రిడ్జి పైనుంచి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండడంతో నిన్నటి నుంచే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం వరకు వంతెనపై నుంచి మూసీ వరద కొనసాగే అవకాశం ఉందని అంచనలతో,,ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు..దింతో అంబర్‌పేట – కాచిగూడ, మూసారాంబాగ్ – మలక్‌పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి..దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది..ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది..దింతో వాహనదారులకు తిప్పలు తప్పడంలేదు..