హైదరాబాద్: అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను CBI అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు..పంజాబ్ నేషల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రూ.52 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించక పోవటంతో గీత దంపతులను CBI అధికారులు అరెస్టు చేశారు..వైద్య పరీక్షలకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..వైద్య పరీఠక్షల అనంతరం CBI కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు,,ఆమె భర్త రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష రూ.1 లక్ష జరిమానా చొప్పున విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది..అలాగే ఈ స్కామ్‌కు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కూ న్యాయస్థానం ఐదేళ్ల శిక్ష విధించింది
నేపధ్యం…బ్యాంకుకు తప్పుడు వివరాలను అందించారని, బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ CBI 2015 జూన్ 30వ తేదిన గీత,,ఆమె భర్త రామకోటేశ్వరావు తోపాటు మరో ముగ్గురుపై చార్జిషీట్ దాఖలు చేసింది..విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు,,బ్యాంకుకు తిరిగి లోన్ చెల్లించలేదు..ఈ కేసును విచారించిన సీబీఐ కోర్టు గీత, ఆమె భర్తకు ఐదేళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధించింది..గతంలొ జరిగిన విచారణలో గీత భర్తను ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించి అతను బ్యాంకుకు రూ.25.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది..రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధిస్తూ,, గీతను నిర్దోషిగా ప్రకటించింది..అయితే నిర్దేశించిన గడువులోగా రుణం చెల్లించకపోవడంతో ఇరువురిపై బ్యాంక్ అధికారులు మరోసారి కేసు నమోదు చేయగా,,సీబీఐ కోర్టు బుధవారం వీరికి జైలు శిక్ష విధించింది..గీత భర్తను,,బ్యాంకు అధికారులను చంచల్‌గూడ జైలుకు తరలించారు..హైకోర్టులో గీత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.