హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు..తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు..ఎమ్యేల్యే విజ్ఞప్తిని,, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు..ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారికంగా పేర్కొంది.. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు..ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి,,ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో,కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేయగా,,నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు..స్పీకర్ ను కలసి అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ,, తెరాస ప్రభుత్వంపై, మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ పై విమర్శలు చేశారు..తెరాస ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని, దీనిలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు..అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందన్నారు..తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను మునుగోడు అభివృద్ధికోసమే రాజీనామా చేశానంటూ స్పష్టం చేశారు.