అమరావతి: జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రీజెన్స్ హేమంత్ కుమార్ లోహియా(57) సోమవారం రాత్రి తాత్కలికంగా నివాసం వుంటున్న అయన స్నేహితుడి ఇంట్లోనే గొంతు కోసి దారుణ హత్య చేయబడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.డీజీపీ ఇంట్లో పని చేసే యసీర్ అహ్మద్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయన సొంత నివాసంలో చిన్న చిన్న మార్పులు జరుగుతున్న నేపధ్యంలో తాత్కలికంగా జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్వాలాలోని స్నేహితుని ఇంట్లో నివాసం వుంటున్నారు.6 నెలల క్రిందట హేమంత్ ఇంట్లో పనికి యసీర్ అహ్మద్ అనే వ్యక్తి చేరాడని జమ్ము సినీయర్ పోలీసు అధికారి ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయం నుంచి ఆయన ఇంటిలో పని చేసే యసీర్ అహ్మద్ కనిపించకుండ పోయాడు.అయితే వెంటనే పోలీసులు ఆప్రమత్తం కావడంతో, పరారీలో ఉన్న యసీర్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ హత్యకు అతనికి ఏదైన సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తొంది. హత్య జరగడానికి ముందు డీజీ హేమంత్ పాదం వాచిందని, లోహియాను హత్య చేసేందుకు, నిందితుడి అయనకు ఊపిరి ఆడకుండా చేసి, అనంతరం పగిలిన సీసాతో గొంతు కోసినట్లుగా ఆధారలు లభించినట్లు తెలుస్తోంది. లోహియా మృతదేహాన్ని తగలబెట్టేందుకు నిందితుడు ప్రయత్నించిన సమయంలో,ఇంటి నుంచి పొగ,మంటలు రావడంతో, బయట వున్న సెక్యూర్టీగార్డులు అప్రమత్తమైన, ఇంటిలోకి వెళ్లి,అయన గది తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సెంట్రల్ డిప్యూటేషన్ నుంచి తిరిగి డీజీపీ హోదాలో పదోన్నతి పొంది, ఆగస్టులో జమ్మూ కశ్మీర్ జైళ్లశాఖ డీజీపీగా నియామితులు అయ్యారు.