అమరావతి: సంగీత విద్వాంసుడు ఇళయరాజా సోమవారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు..ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఆయనను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది..42సంవత్సరా సంగీత ప్రయాణంలో 1,400కు పైగా సినిమాలకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు..7 వేలకి పైగా పాటలకు సంగీతం సమకుర్చారు.. 20 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు..నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు..కేంద్రం పద్మవిభూషణ్, పద్మభూషణ్ తో సత్కరించింది.. 1943 సంవత్సరం జూన్ 3న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పణ్నైపురంలో ఇళయరాజా జన్మించారు.. 14 సంవత్సరా వయసు నుంచే తన అన్నయ్య నడిపే మ్యూజికల్ ట్రూప్‌తో కలిసి పని చేశారు..1976లో ‘అన్నక్కిళి’ అనే సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేసే చాన్స్ దొరికింది..ఈ చిత్రం తరువాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు..