హైదరాబాద్: నేనొక పక్క, తనొక పక్క ఉండటం కంటే, నేను పాలిటిక్స్ నుంచి తప్పకుని, సైలెంట్‌గా ఉండటమే తమ్ముడికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.బుధవారం (5వ తేదీన) ఆయన నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మీ మద్దతు ఉంటున్నట్లుగా గతంలో ప్రకటించారు, ఇప్పటికీ ఆ మాటపైనా ఉన్నారా? అని మీడియా ప్రశ్నించగా, చిరంజీవి పై విధంగా సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నా మద్దతు నా తమ్ముడికి అని స్ట్రాంగ్‌గా అని నేనెక్కడా మాట్లాడలేదు. భవిష్యత్‌లో చేస్తానేమో తెలియదు,,అతను నా తమ్ముడు,,నా తమ్ముడులోని నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎక్కడా పొల్యూట్ కాలేదు,, అంతటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలి. వాడు ఏ పక్షాన ఉంటాడు.. ఎటు వైపు వుంటాడు, ఎలా ఉంటాడనేది.. భవిష్యత్‌లో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది. భవిష్యత్‌లో మంచి నాయకుడు అవుతాడు. ఏమో.. ఏలే అవకాశం ప్రజలు ఇస్తారేమో.. అని నేను భావిస్తాను.. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను.. అని చిరంజీవి అన్నారు.