హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ N.T రామారావు 4వ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలియ వచ్చింది..ఈ పరిణామాలే ఆత్మహత్యకు దారితీశాయని సమాచారం.. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలోని బెడ్రూంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఆమె మృతికి కారణం ఆత్మహత్యగా తెలియడంతో,జూబ్లీహిల్స్ పోలీసులు ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..