ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ?

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది..బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తు, పేపర్లు చింపి స్పీకర్ పై విశారారు.. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్,,ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు ఆసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని.సీతారాం సభ నుంచి సస్పెండ్ చేశారు..ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు స్థానంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అసెంబ్లీ అట్టుడుకింది..ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు..యూనివర్శిటీని ఏర్పాటు చేసిందని ఎన్టీఆర్ అని,, ఆయన గౌరవార్థం ఆ తరువాత యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పెట్టారని,,ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవటం జగన్ నిరకుశత్వానికి నిదర్శనమని,,తెలుగు ప్రజల గౌరవించిన నేత పేరు మార్చే ఆంశంను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు..దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేశారు..ఈక్రమంలో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.. సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లలేదు. ప్రాణాలు అర్పించైనా సరే… ఎన్టీఆర్ పేరును సాధిస్తామని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకునివెళ్లిపోయారు..