తిరుపతిలో కార్మిక శాఖ జాతీయ సదస్సు-కలెక్టర్

ఏర్పాట్లపై సమీక్ష..
తిరుపతి: ఈ నెల 25,26వ తేదిల్లో కార్మిక శాఖ జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించనున్నారని ఏర్పాట్లపై కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వాల్, CPFO,, EPFO కమిషనర్ నీలం షామీ రావుతో కలిసి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ , రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ కార్తికేయ మిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి,TTD EO ధర్మా రెడ్డి, J.C బాలాజీతో వర్చువల్ విధానంలో జాతీయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు..మంగళవారం కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వాల్ మాట్లాడుతూ జాతీయ సదస్సు నిర్వహణ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షణ వుండాలని తెలిపారు..లైజన్ అధికారుల నియామకం, వివిధ కమిటీల ఏర్పాటు, సమన్వయం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు..దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కార్మిక శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు దాదాపు 100 మందికి పైగా రానున్నారని,, రెండు రోజుల పాటు స్థానిక తాజ్ హోటల్ లో జరిగే జాతీయ సదస్సు విజయవంతం చేయాలని కోరారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని, వివిధ పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు..