నెల్లూరు: ఈ నెల 29వ తేదిన ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 26వ తేది నుంచి 29వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలు, క్రీడా ప్రాంగణాలలో స్పోర్ట్స్ మీట్లు నిర్వహించాలని శాప్ అదేశాలు జారీ చేసిందిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిఇఓ పుల్లయ్య గురువారం తెలిపారు. క్రీడా దినోత్సవం సందర్బంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రింది క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.26. మధ్యాహ్నం 3.00 గంటలకు బాక్సింగ్ పోటీలు,,27 మధ్యాహ్నం.3.00 గంటలకు రెజ్లింగ్ పోటీలు,,28. ఉదయం 10.00 గంటలకు ఫుట్ బాల్,,హాకీ పోటీలు.11.గంటలకు గ్రామీణ,,సాంప్రదాయ క్రీడలు,,29 ఉదయం 8 గంటలకు ర్యాలీ, 10.00 గంటలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు.సాయంత్రం క్రీడలలో గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్స్, బహుమతి ప్రధానం,,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉత్సాహవంతులైన క్రీడాకారులు పై పోటీలలో పాల్గొనేందుకు ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు నందు ఆయా తేదీలలో ఒక గంట ముందు హాజరై తమ పేర్లు నమోదు చేసుకుని పోటీలలో పాల్గొని జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు..