వైద్యారోగ్య శాఖకు జాతీయ,రాష్ట్ర,జిల్లాస్థాయిలో పురస్కారాలు

నెల్లూరు: జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో స్వచ్ఛభారత్ అభియాన్ (కాయకల్ప), నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు, లక్ష్య కార్యక్రమాల అమలులో జిల్లా వైద్యారోగ్య శాఖకు జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో పురస్కారాలు లభించడం పట్ల వైద్యారోగ్యశాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిస్టిక్ క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వసతుల కల్పన, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు, పరిశుభ్రతా చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. అనంతరం స్వచ్ఛభారత్ అభియాన్ (కాయకల్ప)లో జాతీయస్థాయిలో పురస్కారాలు పొందిన ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, ఉలవపాడు CHC, రాష్ట్రస్థాయిలో రామతీర్థం PHC, జిల్లాస్థాయిలో రాపూరు, పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు మెమొంటోలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి, లక్ష్య కార్యక్రమాల అమలులో పురస్కారాలు పొందిన కావలి, గూడూరు, కందుకూరు, ఆత్మకూరు వైద్యాధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెమొంటోలు అందించారు. కాయకల్ప అవార్డుల్లో భాగంగా జాతీయస్థాయిలో రూ.20 లక్షలు, రాష్ట్ర, జిల్లాస్థాయిలో లక్ష రూపాయలు చొప్పున నగదు పురస్కారాలను ఆయా ఆసుపత్రులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో DM&HO పెంచలయ్య, DCHS రమేష్ నాథ్,APMNDC EE విజయభాస్కర్, క్వాలిటీ అస్యూరెన్స్ ప్రతినిధులు భరత్, క్రాంతి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.