Close

భవిష్యత్ తరాల కోసం నూతన విద్యా విధానం-ప్రధాని మోదీ

భవిష్యత్ తరాల కోసం నూతన విద్యా విధానం-ప్రధాని మోదీ
  • PublishedDecember 24, 2022

అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.. శనివారం రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ వర్చువల్ విధానంలో పాల్గొన్ని మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానంలో భావి కాల లక్షణాలున్న,,దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు..2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs), వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు..IIT, IIIT, IIM, AIIMS వంటి విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందన్నారు..2014 తరువాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు..భారత దేశ భవిష్యత్తు కాంతులీనాలంటే మన ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు గొప్ప పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు..స్వాతంత్ర్యం లభించిన అమృత కాలంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను,, విద్యా విధానాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు..ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు,, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా శాఖలు ఉన్నాయి..25,000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాల,,అండర్‌గ్రాడ్యుయేట్,,పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందించేందుకు సదుపాయాలు ఉన్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published.