Close

దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తారా?

దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తారా?
  • PublishedOctober 18, 2022

అమరావతి: 25 సంవత్సరాల తరువాత మళ్లీ ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ సదస్సుకు 195 ఇంటర్‌పోల్‌ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు అయ్యారు.ఈ సమావేశాలకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహ్సిన్ భట్ హాజరయ్యారు.ఈ సందర్భంగా  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ముంబై దాడుల సూత్రధారి  హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా, సమాధానం ఇవ్వడానికి మొహ్సిన్ భట్ నిరాకరించారు. ఇబ్రహీం, హఫీజ్ లు భారత భద్రతా ఏజెన్సీల మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ  పాకిస్తాన్‌లో నివసిస్తున్నారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జనరల్‌ అసెంబ్లీ అనేది ఇంటర్‌పోల్‌ అత్యున్నత పాలనా సంస్థ. దాని పనితీరుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఏటా ఒకసారి సమావేశమవుతుంది. ఈ   సమావేశాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయి.ఆయా దేశాలకు చెందిన మంత్రులు, పోలీసు చీఫ్‌లు, దేశ సెంట్రల్‌ బ్యూరోల అధిపతులు, సీనియర్‌ పోలీసు అధికారులు హాజరవుతారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.