ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

అమరావతి: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా(24) అద్వితీయ ప్రదర్శన కనబరిచి(రజత) సిల్వర్ మెడల్ సాధించాడు..అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్‌లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు..జపాన్ కు చెందిన వద్లెచ్ 88.09 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు..రజత పతకం గెల్చిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన నీరజ్‌ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్రీడల్లో భారత్‌కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు మోదీ. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు.