క్రీడలకు ఆతిధ్యం ఇవ్వడంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో వుంది-మంత్రి కాకాణి

నెల్లూరు: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..శుక్రవారం స్థానిక ఎ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆద్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్–హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రి జడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి ఆనం.అరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర మేయర్ స్రవంతి, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ లతో కలసి ప్రారంభించారు. కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1వ తేది నుండి 15 రోజుల పాటు ప్రతి రోజు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతున్నయన్నారు..ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుందన్నారు..అందులో భాగంగా నేడు క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువు పైనే కాకుండా క్రీడలలో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రతి విద్యార్ధి క్రీడలను ఒక అలవాటుగా అలవర్చుకోవాలని కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.