నెల్లూరుకు పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి-మంత్రి అమర్ నాథ్

నెల్లూరు: విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత నెల్లూరుకు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా ముఖచిత్రం సమూలంగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐ టి శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు..గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్లో మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలసి రు.22 కోట్ల రూపాయల నిధులతో ఆటోనగర్ లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేసే శిలాఫలకంను మంత్రి అమర్ నాధ్ ఆవిష్కరించారు.