నెల్లూరుజిల్లాలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడే ఆవకాశం-వాతావరణశాఖ

నెల్లూరు: ఉత్తర-దక్షిణ ఉపరితల ధ్రోణి ప్రస్తుతము చత్తీస్ గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక,, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం,సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ.ఎత్తు వద్ద కొనసాగుతున్నదని,,7వ తేదిన తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనము ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు..దీని ఫలితంగా తదుపరి 48 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని,,వీటి ప్రభావంతో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచన:- ఈరోజు, రేపు నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం..ఎల్లుండి నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం వున్నట్లు అధికారుల పేర్కొన్నారు..