సుందరంగా తయారు అవుతున్న నెల్లూరు రైల్వేస్టేషన్-అరుణ్ కుమార్ జైన్

నెల్లూరు: రైల్వే మంత్రిత్వశాఖ రైల్వే స్టేషన్ లను సుందరంగా తీర్చిదిద్దె౦దుకు,,ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించడానికి ‘రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను చేపట్టడడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.ఈపీసీ విధానంలో అప్‌గ్రేడేషన్ పనులు మంజూరు అయ్యాయని, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.నెల్లూరుజిల్లాలో విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారస్తులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో స్టేషన్ కు ప్రత్యేక స్థానం వుందన్నారు. ప్రస్తుతం దాదాపు 30,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణం కొనసాగించడం జరుగుతోందని పేర్కొన్నారు. రూ.102 కోట్ల అంచనా వ్యయంతో ఆగస్టు 2022లో కాంట్రాక్టు అప్పగించమని,,మే 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అవసరమైన అన్నిఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు నిర్ణిత వ్యవధిలో పనులను పనిచేసేలా పూర్తి సహకారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.