AMARAVATHIDISTRICTS

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ జిల్లాకు కొత్త కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టారు..శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు..ఇప్పటివరకు కలెక్టర్‌గా ఉన్న శివశంకర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది..

ముగ్గురు ఎస్పీల నియామకం:- పల్నాడు జిల్లాకు మల్లికా గర్గ్,,తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్,, అనంతపురం జిల్లాకు గౌతమి శాలిని నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది..ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది..తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన అల్లర్లపై వెంటనే చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.. మూడు పోస్టులకు ఏపీ ప్రభుత్వం ఐదుగురు పేర్లతో కూడిన ప్యానల్‌ను పంపించింది..ఒక్కో ఎస్పీ పోస్ట్‌ కు ముగ్గురు పేర్ల చొప్పున ప్యానల్ పంపాల్సిందేనని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో ఒక్కో ఎస్పీ పోస్ట్‌ కు ముగ్గురేసి అధికారుల పేర్ల లిస్ట్ ను సీఎస్ జవహర్ రెడ్డి పంపడం జరిగింది..

డీజీపీతో సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ సమావేశం:- డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ శనివారం భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.. పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ ఇప్పటికే వెళ్లినట్టు డీజీపీకి వినీత్ తెలిపారు..ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన FIRలను ముందు సిట్ పరిశీలించనుందని చెప్పారు..FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,, లేక సెక్షన్లు మార్చాలా అనే విషయంపై సిట్ నిర్ణయం తీసుకోనుందన్నారు..ఇప్పటి వరకు కేసులు ఫైల్ చేయకపోతే కొత్తగా FIRలను సిట్ నమోదు చేయించనుంది..కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై సిట్ ఆరా తీస్తోంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *