INTERNATIONAL

చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు అంటూ సోషల్ మీడియాలో వార్తలు?

అమరావతి: చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడిని ఆ దేశ సైన్యం హౌస్ అరెస్ట్ చేసిందన్న వార్తలు సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తున్నాయి..  మనదేశంలోనూ ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా చైనా అధ్యక్షడు హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు.ఆ దేశ రాజధాని బీజింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన కంట్రోల్ లోకి తీసుకుందని, సైనాకాధికారి లీ కియావోమింగ్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అక్కడి ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. దాదాపు 80 కీ.మీ మేర సైనిక వాహనాలు బీజింగ్ చుట్టుముట్టినట్టు కొన్ని వీడియోలు కూడా ప్రచారమవుతున్నాయి. ఇదే సమయంలో బీజింగ్ నుంచి వెళ్లే విమానాలు,సూపర్ ఫాస్ట్ రైళ్లు, బస్సు సర్వీసులు రద్దయ్యాయంటూ కొందరు ట్వీట్ చేశారు. 

దాదాపు రెండేళ్ల పాటు దేశం నుంచి కదలని జిన్ పింగ్,,గత వారంలో ఉజ్బెకిస్థాన్ లోని సమర్కండ్ వెళ్లి,అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్ల సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇంచార్జి పదవుల నుంచి జిన్ పింగ్ ను తొలగించారంటు వార్తులు వస్తున్నాయి.వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన చూడడమే ఇందుకు కారణమని,జిన్ పింగ్ ను నిలవరించేందుకు, సమర్కండ్ నుంచి వచ్చాక జిన్ పింగ్ ను అరెస్ట్ చేశారంటు సోషల్ మీడియాలో పోస్టులు.. అయితే ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అక్కడి న్యూస్ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక వేళ చైనాలో కరోనా ఉధృతంగా వున్న నేపధ్యంలో,జిన్ పింగ్ ఇతరదేశాలకు వెళ్లి వచ్చాడు కాబట్టి,అయనను,హోమ్ క్యారంటైన్ లో వుంచారా? లేదా తైవాన్ పై చర్యలు తీసుకునేందుకు సైన్యంను ఆప్రమత్తం చేస్తున్నారా అనే విషయంలో స్పష్టత లేదు? మరో రెండు రోజులు అగితే కాని, ఏ విషయం అనేదానిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం లేదు??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *