AMARAVATHICRIMEHYDERABAD

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని 24 ప్రాంతాల్లో NIA సోదాలు             

అమరావతి: తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం వేకువజామునుంచే పలు 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగిందని NIA అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.. నిజామాబాద్ లో,, హైదరాబాద్,,జగిత్యా,,నిర్మల్ 2,, ఆదిలాబాద్,,కరీంనగర్ ల్లోను,,ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాళెం,,గుంటూరు,,కడప, కర్నూలుజిల్లాలో తనిఖీలు చేయడం జరిగిందన్నారు..రెండు రాష్ట్రల్లో జరిగిన సోదాల్లో రూ.8.31లక్షల నగదుతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది..వీరి వద్ద డిజిటల్ పరికరాలతో పాటు కీలక పత్రాలు,, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది..గతంలో PFI నేతలు అబ్దుల్ ఖాదర్,,షేక్ షహదుల్ల,, మహమ్మద్ ఇమ్రాన్,, అబ్దుల్ మొబిన్ లను పోలీసులు అరెస్టు చేశారు..నిజామాబాద్ జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని ఆగస్టు 26వ తేదిన 52 మందిపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది..అధికారులు జరిపిన సోదాల్లో యువకులకు కరాటే,లీగల్ ఆవేర్ నెస్ క్యాంపుల పేరిట PFI ట్రైనింగ్ ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లో వర్గాల మధ్య  చిచ్చు పెట్టి మత విధ్వేషాలు రెచ్చగొట్టెలా క్యాంపులు నిర్వహించారని పేర్కొంది. 

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం MS ఫారంలో షేక్ ముఖిద్ ఇంట్లో NIA అధికారుల సోదాలు ముగిశాయి. బ్యాంక్ అకౌంట్, లావాదేవీలపై NIA వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది..పాస్ పోర్టు సీజ్ చేసిన అధికారులు,బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లారు..హైదరాబాద్ లోని NIA కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని  టీఆర్ నగర్ లోని 4 ఇళ్లతో పాటు, మెడికల్ షాపులో,,టవర్ సర్కిల్  ఏరియాలో సోదాలు జరిగాయి..ఈ తనిఖీల్లో ఒకరి ఇంట్లో డైరీతో పాటు పలు కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. 

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్‌లో NIA అధికారులు సోదాలు నిర్వహించారు..ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు..ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాస్‌తో పాటు మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *