అమరావతి: కేరళ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గత 24 గంటలు నుంచి మెరుపు దాడులు నిర్వహిస్తోంది. కేరళ వ్యాప్తంగా ఏకకాలంలో 58 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని నిషేదిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నాయకుల స్థావరాలపై దాడులు జరుపుతోంది..PFI నాయకులు వేరే పేరుతో దిత్వీయ శ్రేణినాయకులు PFIని తిరిగి నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఈ దాడులను నిర్వహిస్తోంది..ఆ సంస్థకు చెందిన కొందరు కీలక వ్యక్తుల ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసుకుని బుధవవారం రాత్రి ప్రారంభమైన NIA దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి..కేరళలోని ఎర్నాకులంలో నిషేధిత PFI నేతలకు సంబంధించిన 8 ప్రత్యేక కార్యాలయాలు,, తిరువనంతపురంలో 6 కేంద్రాలు లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి.