NATIONAL

తెలుగు రాష్ట్రల అప్పుల వివరాలను వెల్లడించిన నిర్మలా సీతారామన్

అమరావతి: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా వెల్లడించారు..తెలంగాణకు 2022 నాటికి 3 లక్షల 12 వేల 191.3 కోట్ల అప్పు వుందని,, ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల 98 వేల 903.6 కోట్ల అప్పులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు..2020లో తెలంగాణకు అప్పులు 2 లక్షల 25 వేల 418 కోట్ల అప్పు వుండగా,, 2021 నాటికి 2 లక్షల 67 వేల 530.7 కోట్లకు చేరాయని,,అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు 2020లో 3 లక్షల 7 వేల 671.5 కోట్ల అప్పు వుండగా,,2021 నాటికి 3 లక్షల 60 వేల 333.4 కోట్లకు చేరాయన్నారు..కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ సమాధానంలో.. బడ్జెటేతర రుణాల వివరాలు లేకుండా కేవలం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలను వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *