5G+ సేవల కోసం ప్రస్తుతానికి సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు-Airtel

అమరావతి: Airtel దేశంలోని 8 నగరాల్లో 5G+ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రస్తుతానికి సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5G ఫోన్ ఉంటే సరిపోతుందని Airtel తెలియచేసింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పుర్, వారణాసి నగరాల్లోని వినియోగదారులు 5G+ సేవలను ఉపయోగంచుకోవచ్చని సంస్థ పేర్కొంది. దశలవారీగా ఈ సేవలను అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5G+ సేవలను పొందొచ్చని,, 5G సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకు 4G ప్లాన్లతోనే హైస్పీడ్ డేటా సేవలు పొందొచ్చని పేర్కొంది. 5G స్మార్ట్ ఫోన్స్ అన్ని Airtel 5Gకి సపోర్ట్ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్ తయారుదారు సంస్థలు OTA అప్‌డేట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.